రాయలసీమ న్యూస్ - చిత్తూరు
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ శిశు విహార్‌ను సందర్శించి సౌకర్యాలు, దత్తత రికార్డులు, మిషన్ వాత్సల్య పోర్టల్ డేటా నమోదు విధానాన్ని పరిశీలించారు. భవనానికి పెయింటింగ్, విద్యుత్ వైరింగ్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, ఓపెన్ కారిడార్‌కు ఇనుప గ్రిల్ ఏర్పాటు వంటి అభివృద్ధి, భద్రతా పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించి, పిల్లల ఆరోగ్య పరీక్షలకు ప్రత్యేక పీడియాట్రిషియన్‌ను నియమించాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు.
పిల్లల పోషకాహారం కోసం రూ.25 వేల్ని విడుదల చేసి, వారి సంరక్షణ, ఆరోగ్యం, విద్య, వినోదంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శిశు విహార్‌లో సౌకర్యాల పరిశీలన – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని శిశు విహార్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ మంగళవారం సందర్శించారు.
అక్కడి సౌకర్యాలు, పిల్లలకు అందిస్తున్న సేవలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. శిశు విహార్‌లో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి వారి పరిస్థితులు, అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి