రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

“కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన

ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్వహిస్తున్న “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించి, నాలుగు వారాల్లో మొత్తం 71 ఫిర్యాదులు స్వీకరించారు. వీధిలైట్లు, మంచినీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ వంటి 30 సమస్యలను ఇప్పటికే పరిష్కరించగా, మిగిలిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ ప్రాధాన్యతా క్రమంలో చర్యలు కొనసాగిస్తున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.

“కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో నిర్వహిస్తున్న “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలన అందుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.

జూలై 27, 2026 సోమవారం నుండి వరుసగా నాలుగు వారాలపాటు ప్రతి వారం నిర్వహించిన “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 71 ఫిర్యాదులు స్వీకరించినట్లు కమిషనర్ వివరించారు. ఈ ఫిర్యాదుల్లో ప్రధానంగా వీధిలైట్లు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్లు, ఆక్రమణలు, ట్రాఫిక్ సమస్యలు, ఆవులు, కుక్కలు తదితర ప్రజా సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →