రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట CPI ధర్నా

కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట CPI నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ఎన్నికల హామీల అమలు, కడప నగర సమగ్రాభివృద్ధికి రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల లేని పేదలకు ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు,సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు వడ్డీలేని రుణాలు, నిరుద్యోగ భృతి, తాగునీటి సమస్య పరిష్కారం వంటి పలు సంక్షేమ చర్యలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.

కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట CPI ధర్నా కడప నగర సమగ్రాభివృద్ధి, ఎన్నికల హామీల అమలు కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (CPI) నగర సమితి ఆధ్వర్యంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఎన్నికల హామీల అమలులో భాగంగా కడప నగర సమగ్రాభివృద్ధికి రూ.5 వేల కోట్లు నిధులు కేటాయించాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, పేదవర్గాల సంక్షేమానికి ఈ నిధులు వినియోగించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →