రాయలసీమ న్యూస్ - అనంతపురం

ప్రజా సమస్యల పరిష్కారానికి 24న కలెక్టరేట్ వద్ద ధర్నా

అనంతపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని, సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి 24న కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతపురం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోరే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మంగళవారం అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద 24న జరగనున్న ధర్నాకు సంబంధించిన పోస్టర్లను సాకే హరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ధర్నాను విజయవంతం చేయాలని, విస్తృత స్థాయిలో ప్రజలు, సంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →