రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
పులివెందుల మండలం ఈ.కొత్తపల్లి గ్రామంలో అంత్రం, మంత్రం పేరుతో మత్తుమందు ఇచ్చి ఆలీపు చేతిలోని సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరం అపహరించిన ఫకీరు గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఫకీరు నేపథ్యం, ఇలాంటి ఘటనలు మరెక్కడైనా చేశాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అంత్రం పేరుతో మత్తుమందు ఇచ్చి బంగారు ఉంగరం చోరీ పులివెందుల: మండలంలోని ఈ.కొత్తపల్లి గ్రామంలో అంత్రం, మంత్రం పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మబలికి మత్తుమందు ఇచ్చి, సుమారు రూ.80 వేల విలువైన ఉంగరాన్ని అపహరించినట్లు సమాచారం.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం… ఈ.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆలీపు ఇంటి వద్దకు ఓ ఫకీరు వచ్చాడు. అంత్రం వేస్తే ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని, శుభం జరుగుతుందని ఆలీపు కుటుంబ సభ్యులను నమ్మబలికినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి