రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై తీర్పు రిజర్వ్‌

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వులో ఉంచి, అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపాలని సిఫారసు చేసింది. ఎంపిక ప్యానెల్‌లో ప్రధాని ఆధిక్యం ఉందన్న అభ్యంతరాలను కేంద్రం తరఫున Solicitor General తుషార్‌ మెహతా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్యంపై అవిశ్వాసం చూపడమ

ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై తీర్పు రిజర్వ్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సి ఉందని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కక్షిదారులు రాతపూర్వక వాంగ్మూలాలు సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై 2023లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →