రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య (72) బావిలో పడి మృతి చెందగా, మంగళవారం గొల్లపల్లి సమీప బావిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గ్రామస్తుల సహాయంతో వెలికితీశారు. జూలై 31 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 1న పెన్షన్ తీసుకోకపోవడంపై అనుమానం వ్యక్తం చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదమా, ఇతర కారణాలా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లక్కిరెడ్డిపల్లెలో బావిలో పడి వృద్ధుడి మృతి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు బావిలో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు, గ్రామస్తుల సహకారంతోఆయన మృతదేహాన్ని గుర్తించారు.
పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, లక్కిరెడ్డిపల్లె మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య (72) జులై 31న కూలి పనుల కోసం ఇంటి నుంచి వెళ్లారు. అయితే ఆ రోజు సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి