రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ప్రొద్దుటూరు బకరాపేటకు చెందిన 90 ఏళ్ల మంగళ బాలమ్మ మంచానికి పరిమితమై ఉండటంతో, ఆమె ఇంటివద్దకే ఎన్నికల హియరింగ్ నిర్వహించారు. ఓటరు పేరులో పొరపాటు సరిచేయడానికి పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేయగా, మంచానికి పరిమితమైన ఓటర్లకు కూడా ఓటు హక్కు వినియోగంలో ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు స్పష్టం చేశారు.
మంచానికి పరిమితమైన వృద్ధ ఓటరు ఇంటివద్దే హియరింగ్ ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని బకరాపేటకు చెందిన మంగళ బాలమ్మ (90) అనే వయోవృద్ధ ఓటరు కదలలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉండటంతో, ఆమె ఇంటివద్దకే ఎన్నికల హియరింగ్ నిర్వహించిన ఘటన చోటుచేసుకుంది. స్పెషల్ ఇంటెన్షవ్ రెవిజన్ సందర్భంగా ఓటరు పేరులో పొరపాటు ఉన్నందున హియరింగ్‌కు హాజరుకావాలని పురపాలక సంఘం కార్యాలయం నుంచి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు
పురపాలక సంఘం కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్, స్పెషల్ ఇంటెన్షవ్ రెవిజన్‌లో భాగంగా ఓటరు వివరాల పరిశీలన కోసం నోటీసులు పంపిన వారిలో మంగళ బాలమ్మ కూడా ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆమె అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉండటంతో, హియరింగ్‌కు హాజరుకాలేకపోయారని కుటుంబ సభ్యుల ద్వారా కమిషనర్‌కు సమాచారం అందింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి