రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్ నకిలీ నోటీసులు – ఎస్పీ హెచ్చరిక

అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిధిలో ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో నకిలీ నోటీసులు పంపిస్తున్న ఘటనలపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని నంబర్ల నుండి వచ్చే సందేశాల్లోని లింకులు, .zip, .exe ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, ఆదాయపు పన్ను శాఖ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపదని స్పష్టం చేశారు.

సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్ నకిలీ నోటీసులు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరిక అన్నమయ్య జిల్లా మదనపల్లి పరిధిలో ఆదాయపు పన్ను శాఖ పేరుతో వాట్సాప్‌లో నకిలీ నోటీసులు పంపిస్తున్న ఘటనల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీ

తెలియని నంబర్ల నుండి వస్తున్న సందేశాలు, ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటీసుల పేరుతో వస్తున్న వాటిని నిర్లక్ష్యం చేయాలని, వాటిలో ఉన్న లింకులు, ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎస్పీ వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో వాట్సాప్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ నోటీసుల పేరుతో కొన్ని సందేశాలు ప్రజలకు చేరుతున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →