రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఒక సెల్ పాయింట్‌లో నకిలీ iPhone విక్రయం ఘటన స్థానికులను కలవరపెడుతోంది. హైదరాబాద్ యువకుడు రూ.51 వేలకుగాను కొనుగోలు చేసిన ఫోన్‌ను iPhone కేర్ సెంటర్‌లో పరీక్షించగా డూప్లికేట్‌గా తేలింది.
బాధితుడు పోలీసులను ఆశ్రయించినా, వ్యాపారి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తూ బెదిరించడంతో, పట్టణంలో నకిలీ ఫోన్ల రాకెట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారు ప్రొద్దుటూరుకు మచ్చపెట్టిన నకిలీ ఐఫోన్ మోసం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం పేరు వినగానే ఒకప్పుడు వ్యాపార ధర్మం, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన "బంగారు ప్రొద్దుటూరు" గుర్తుకొచ్చేది.
అయితే ఇటీవల కొందరు అక్రమార్కులు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల వల్ల ఈ పట్టణ ప్రతిష్టకు గండిపడుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ వ్యాపారంలో జరుగుతున్న మోసాలు బయటపడటంతో, బయట ప్రాంతాల ప్రజలు "ప్రొద్దుటూరులో ఏమైనా కొనొచ్చు గానీ సెల్ ఫోన్లు మాత్రం కొనకూడదు" అనే స్థాయికి చేరుకున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి