రాయలసీమ న్యూస్ హెల్త్ డెస్క్
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఆకస్మిక తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ పానీపూరీ, సమోసాలు తయారుచేస్తున్న అక్రమ కేంద్రాన్ని బహిర్గతం చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా, తీవ్రమైన అపరిశుభ్ర పరిస్థితుల్లో భారీ స్థాయిలో తయారీ, సరఫరా జరుగుతున్నట్లు గుర్తించి వేలాది పానీపూరీలు, సమోసాలు, వాడిన నూనెను ధ్వంసం చేసి కేంద్రాన్ని సీజ్ చేశారు.
బయట ఆహారం తినే వారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్‌లో కల్తీ పానీపూరీ, సమోసాలు తయారీ బహిర్గతం హైదరాబాద్ అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కల్తీ ఆహార తయారీ కేంద్రం బహిర్గతమైంది.
ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నడుస్తున్న ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేంద్రంలో భారీ స్థాయిలో పానీపూరీలు, సమోసాలు తయారు చేసి నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి