రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఓడి చెరువు మండలంలో 2,237 మంది రైతులకు ఫోటోతో పాటు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసి, రైతు భూ హక్కులకు కూటమి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ, ఆమడ గూరు మండలంలో భారీ Reliance Solar ప్రాజెక్ట్, ఓడి చెరువులో మరో Solar ప్రాజెక్ట్ ద్వారా నియోజవర్గం పరిశ్రమల కేంద్రంగా, ఉపాధి హబ్‌గా మార

రైతు హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబాటు: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతుల హక్కులను పరిరక్షిస్తూ, భూ యాజమాన్యానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఓడి చెరువు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో డబురువారిపల్లి, తిప్పేపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా 2,237 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రతో పాటు సంబంధిత రైతు ఫోటో ముద్రించి ఇవ్వడం ద్వారా భూ యాజమాన్యంపై రైతులకు మరింత భరోసా కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆమె పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →