రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం జెన్AI ప్రభావంతో INDలో వ్యవసాయేతర రంగాల్లో 8-12% ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, సేవా రంగాల్లో 42-48% ఉద్యోగుల పనిని ఇది సులభతరం చేయనుంది. టెలికం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ రంగాల్లో ప్రత్యక్ష ప్రభావం ఎక్కువగా ఉండగా, నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకుంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయని నివేదికలో విశ్లేషించింది.
ఇండియాలో 8-12% వ్యవసాయేతర ఉద్యోగాలపై జెన్AI ప్రభావం: గోల్డ్మన్ సాచ్స్ నివేదిక జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్AI) ప్రభావంతో INDలోని వ్యవసాయేతర రంగాల్లో 8-12 శాతం ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉందని గోల్డ్మన్ సాచ్స్ తాజా నివేదికలో పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సేవా రంగాలపై జెన్AI ప్రభావం గణనీయంగా ఉండబోతుందని నివేదిక విశ్లేషించింది.
హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మీడియా, ఫైనాన్షియల్ వంటి సేవా రంగాల్లో పనిచేస్తున్న 42-48 శాతం ఉద్యోగులకు జెన్ AI కారణంగా పని మరింత సులభతరం కానుందని గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. ఈ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటంతో పాటు ఉత్పాదకత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నివేదికలో విశ్లేషణ చేసింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి