రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ అనే ఇద్దరు మహిళలు గల్ఫ్‌లోని మస్కట్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరి పాస్పోర్ట్‌లు అరబ్ షేక్‌ల వద్ద ఉండగా, అదనపు డబ్బు డిమాండ్ కారణంగా స్వదేశానికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఇండియన్ ఎంబసీ తక్షణం జోక్యం చేసుకోవాలని బాధితులు, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గల్ఫ్‌లో ఇరుక్కున్న ఇద్దరు మహిళల ఆర్తనాదం… ఆర్థిక ఇబ్బందులు, బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు మహిళలు ఇప్పుడు స్వదేశానికి చేరుకుంటామో లేదో అన్న భయంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, ఉయ్యూరు ప్రాంతాలకు చెందిన శిరోమణి, పద్మ అనే మహిళలు కొన్ని నెలల క్రితం మస్కట్ ప్రాంతానికి గల్ఫ్ ఏజెంట్ల ద్వారా వెళ్లారు. మంచి జీతం వస్తుందని, కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశతో విదేశాలకు అడుగుపెట్టిన వీరు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి