రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం మోదినాబాద్ 37వ వార్డులో సుంకులమ్మ గుడి ఎదురుగా మురికి కాలువ నిర్మాణం మధ్యలో ఆగిపోవడంతో నీరు నిల్వపడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువకు సమీపంలో కరెంటు ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం, పందులు–దోమలు పెరగడం వల్ల ప్రమాదం, ఆరోగ్య సమస్యల భయం ఉందని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సమస్యను తక్షణమే పరిష్కరించాలని మున్సిపాలిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
గుంతకల్లు 37వ వార్డులో మురికి కాలువ సమస్య తీవ్రం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మోదినాబాద్ 37వ వార్డు సుంకులమ్మ గుడి ఎదురుగా ఉన్న లైన్‌లో మురికి కాలువ సమస్య తీవ్రంగా మారింది. కాలువ నిర్మాణాన్ని మున్సిపాలిటీ అధికారులు మధ్యలోనే ఆపివేయడంతో కాలువ నీరు నిల్వపడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
వార్డు ప్రజల వివరాల ప్రకారం, కాలువ మార్గంలో ప్రైవేటు ప్లాట్లు ఉండటంతో అక్కడ యు-టర్న్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో కాలువ నీరు ముందుకు సాగకుండా గుంతలు ఏర్పడి, మురికి నీరు నిల్వ ఉండిపోతున్నదని వారు చెబుతున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి