రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్

రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం నలుగురి అనుమానాస్పద మృతి కలకలం

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ దాస్‌పారా ప్రాంతంలో హిందూ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో ఇంట్లోనే మృతిచెందడం కలకలం రేపింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, కుమార్తె ఆగామి చక్రవర్తి ప్రార్థి, కుమారుడు ప్రియం చక్రవర్తి మృతదేహాలు ఇంటి వివిధ చోట్ల లభించగా, గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీఐడీ, డిటెక్టివ్ బ్రాంచ్‌తో కలిసి రంగ్‌పూర్ మెట్రోపాలిటన్ పోలీస్ దర్యాప్తు వేగవంతం చేస్తూ, ఖచ్చితమైన కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం నలుగురి అనుమానాస్పద మృతి కలకలం బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దాస్‌పారా (మచువాపారా) ప్రాంతంలో ఉన్న వారి స్వగృహంలోనే రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు మృతదేహాలు లభించాయి. ఈ ఘటన హిందూ సమాజంలోనూ, మొత్తం నగరంలోనూ భయాందోళనలు సృష్టిస్తోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →