రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
హిందూపురంలో పాన్ బ్రోకర్ భాస్కర్‌పై బంగారు కుదువ మోసం ఆరోపణలతో వికలాంగుడు షామీర్ భాష కుటుంబ సభ్యులు, CPI నాయకత్వంలో ఆయన ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. బంగారు అమ్మేసినట్టు ఆరోపణల మధ్య ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనగా, Two Town పోలీసులు మధ్యవర్తిత్వం చేసి Police Stationకు తీసుకెళ్లి ASP మహేష్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
బంగారు కుదువ మోసం ఆరోపణలపై హిందూపురంలో ధర్నా హిందూపురం పట్టణంలో బంగారు కుదువ వ్యాపారి అయిన పాన్ బ్రోకర్ భాస్కర్‌పై ఘరానా మోసం ఆరోపణలు వెలుగుచూశాయి. వికలాంగుడైన షామీర్ భాష అనే వ్యక్తి పెట్టిన బంగారు కుదువను తిరిగి ఇవ్వకుండా, డబ్బు, వడ్డీ చెల్లింపుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించాడని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బాధితుడు బంధువులతో కలిసి భాస్కర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించాడు. వివరాల్లోకి వెళితే, హిందూపురం పట్టణానికి చెందిన షామీర్ భాష 2014లో పాన్ బ్రోకర్ భాస్కర్ వద్ద అర్ధ కిలో బంగారు కుదువ పెట్టి 11 లక్షల 70 వేల రూపాయలు నగదు తీసుకున్నాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి