రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
హాలీవుడ్ దర్శకుడు మార్క్ రైడెల్ (97) వృద్ధాప్యంతో సంబంధం ఉన్న అనారోగ్య కారణాల వల్ల లాస్ ఏంజిలెస్‌లోని వుడ్‌ల్యాండ్ హిల్స్ విశ్రాంతి గృహంలో కన్నుమూశారు. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్‌లో టెలివిజన్, సినిమాల్లో విశేష కృషి చేసిన ఆయన ‘ది లాంగ్ గుడ్ బై’, ‘ది ఫాక్స్’, ‘సిండ్రెల్లా లిబర్టీ’, ‘ది రోజ్’, ‘ఆన్ గోల్డెన్ పాండ్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందగా, నటులలో ఉత్తమ నటన వెలికితీసే నైపుణ్యంతో ‘
హాలీవుడ్ దర్శకుడు మార్క్ రైడెల్ కన్నుమూత ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మార్క్ రైడెల్ (97) మృతిచెందారు. లాస్ ఏంజిలెస్‌లోని వుడ్‌ల్యాండ్ హిల్స్‌లో వినోద పరిశ్రమ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓ విశ్రాంతి గృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
వృద్ధాప్యంతో సంబంధం ఉన్న కారణాల వల్ల తన తండ్రి మరణించినట్లు రైడెల్ కుమార్తె అమీ రైడెల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆయన మరణవార్త తెలిసిన హాలీవుడ్ సినీ ప్రముఖులు రైడెల్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి