రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రైవేటు బస్సుల్లో అక్రమ సరుకు రవాణాపై రవాణాశాఖ కొరడా

ప్రొద్దుటూరు పరిధిలో ప్రైవేటు బస్సుల్లో వాణిజ్య సరుకుల అక్రమ రవాణాపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి విస్తృత తనిఖీలు నిర్వహించి భారీ జరిమానాలు విధించారు. Seven Hills, Indu Travels యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, నిబంధనలు పాటించకపోతే పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ప్రయాణికుల భద్రత కోసం ప్రజలు RTC సేవలను వినియోగించాలని, అక్రమ రవాణా కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు బస్సుల్లో అక్రమ సరుకు రవాణాపై రవాణాశాఖ కొరడా ప్రొద్దుటూరు: ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను ప్రయాణికుల రవాణా కోసం కాకుండా వాణిజ్య సరుకుల తరలింపుకు వినియోగిస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు కఠిన చర్యలకు దిగారు.

ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి బస్సుల్లో యథేచ్ఛగా వాణిజ్య సరుకులను రవాణా చేస్తున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదం మోపారు. ప్రైవేటు బస్సుల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై "సిండికేట్ దందా ఆగేది ఎప్పుడు?" ' ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ఆర్టీవో నారాయణ నాయక్ నేతృత్వంలో అధికారులు సోమవారం, మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →