రాయలసీమ న్యూస్ - తిరుపతి
చిత్తూరు జిల్లా ముత్తరపల్లి గ్రామానికి చెందిన 24ఏళ్ల కె. చిరంజీవి పెళ్లి సమయంలో చేసిన సుమారు రూ.4 లక్షల అప్పులు తీర్చలేక రేణిగుంట సమీపంలోని వెంకటాపురం ఇటుక కర్మాగారంలో కూలీగా పనిచేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున రేకుల షెడ్డు పైకప్పు ఐరన్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, భార్య నాగవేణి ఫిర్యాదు ఆధారంగా రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అప్పుల బారిన యువకుడు ఆత్మహత్య..
రేణిగుంటలో విషాదం రేణిగుంట - : పెళ్లి సమయంలో చేసిన అప్పులు జీవితాన్ని గాలికొదిలేశాయి. భార్యను బాగా చూసుకోవాలని, అప్పుల బారం నుంచి బయటపడాలని ఊరు కాని ఊరు చేరి కూలి పనులు చేస్తూ పోరాడిన ఓ యువకుడు చివరికి ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న ఘటన రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి