రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్

పూజ సింగ్‌కి నిరాశ అండర్-20లో భారత్‌కి మిశ్రమ ఫలితాలు

ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ చివరి రోజున భారత్‌కి పతకాలు రాకపోయినా, మొత్తం టోర్నీని మూడు పతకాలతో ముగించడం విశేషంగా నిలిచింది. మహిళల హైజంప్‌లో పూజ సింగ్‌ 1.84 మీటర్లతో ఏడో స్థానంలో, 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది.

జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజతం, హై జంప్ లో బసంత్ కుమార్ రజతం, లాంగ్ జంప్ లో షానవాజ్ కాంస్య పతకం భారత్‌కి దక్కాయి. పూజ సింగ్‌కి నిరాశ అండర్-20లో భారత్‌కి మిశ్రమ ఫలితాలు ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ చివరి రోజు భారత అథ్లెట్లు అంచనాలకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు.

ముఖ్యంగా మహిళల హైజంప్‌ విభాగంలో పూజ సింగ్‌ నుంచి పెద్ద ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆమె మెడల్‌ పోటీలో నిలవలేకపోయింది. 19 ఏళ్ల పూజ సింగ్‌ సోమవారం జరిగిన హైజంప్‌ ఫైనల్లో గరిష్ఠంగా 1.84 మీటర్ల ఎత్తు దూకి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →