రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

ఇంస్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం: బీహార్ యువకుడిపై దాడి, హత్యాయత్నం కేసు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇంస్టాగ్రామ్‌లో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో బీహార్ యువకుడు ముకేశ్‌పై అమ్మాయి బంధువులు అడవి ప్రాంతంలో ప్లంబర్ పైపులతో గంటల తరబడి దాడి చేసి గాయపరిచిన ఘటన కలకలం రేపుతోంది. సహచరులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం: బీహార్ యువకుడిపై దాడి, హత్యాయత్నం కేసు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇంస్టాగ్రామ్ ద్వారా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం నేపథ్యంగా ఓ బీహార్ యువకుడిపై అమానుష దాడి జరిగిన ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసి కలకలం రేపుతోంది.

అమ్మాయి తరఫు బంధువులు యువకున్ని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి ప్లంబర్ పైపులతో విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు, పోలీసులు వెల్లడించారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మదనపల్లి మండలం సీటీఎం ప్రాంతంలోని ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్న బీహార్ యువకుడు ముకేశ్ (20) మదనపల్లెలోని శ్రీనివాస సిమెంట్ అంగడిలో పనిచేస్తున్నాడు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →