రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
ముదిగుబ్బ మండలంలో హంద్రీనీవా ఆధారంగా నిర్మిస్తున్న జిల్లేడుబండ జలాశయం విషయంలో భూసేకరణ, పరిహారం ప్రక్రియలు సక్రమంగా జరగలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2.41 టీఎంసీల సామర్థ్యంతో రూపకల్పన చేసిన ప్రాజెక్టు వల్ల పొడరాళ్లపల్లి గ్రామం సహా వేల ఎకరాలు ముంపు ప్రమాదంలో పడతాయని, సామర్థ్యాన్ని 1.5 టీఎంసీలకు తగ్గించి తగిన పరిహారం ఇవ్వాలని బాధితులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లేడుబండ జలాశయంపై రైతుల్లో ఆందోళన పుట్టపర్తి: జలాశయం నిర్మాణానికి ముందుగా రైతులను ఒప్పించి, చట్టబద్ధంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. బాధిత రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, చట్టం ప్రకారం పరిహారం నిర్ణయించి, ఆ పరిహారం పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి.
అయితే ముదిగుబ్బ మండలంలో హంద్రీనీవా ఆధారంగా నిర్మిస్తున్న జిల్లేడుబండ రిజర్వాయర్ విషయంలో గత వైకాపా ప్రభుత్వం ఈ ప్రక్రియలను పాటించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుత్తేదారులకు లాభం చేకూర్చడం, కమీషన్లు దండుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే జలాశయ నిర్మాణం మొదలుపెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి