రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప నగరంలో రహదారులపై ప్రమాదకర బైక్ స్టంట్స్‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సోషల్ మీడియా ఆధారంగా 50 మంది యువకులను గుర్తించి, స్టంట్స్‌కు ఉపయోగించిన 40 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 30 మంది మైనర్లు ఉండటంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, ఇలాంటి స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ షెల్కె శరత్ విశ్వనాథ్ హెచ్చరించారు.
కడప రహదారులపై బైక్ స్టంట్స్‌కి చెక్:40 బైకులు స్వాధీనం కడప నగరంలో ప్రజా రహదారులపై ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ నిర్వహిస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై కడప ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యలపై పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ షెల్కె శరత్ విశ్వనాథ్ కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
సోషల్ మీడియా ఆధారంగా స్టంట్స్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా సుమారు 50 మంది యువకులను విజయవంతంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి