రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప RIMS జూనియర్ డాక్టర్లు 20–25% స్టైఫండ్ పెంపు అమలు అయ్యే వరకు 11వ రోజుకు చేరుకున్న తమ సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం 3%, 5% పెంపు ప్రతిపాదనను తాము అంగీకరించలేమని, ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి పెంపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య సేవలు అంతరాయం కలగకుండా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కడప RIMS జూనియర్ డాక్టర్ల రక్తదానం కడప: జూనియర్ డాక్టర్లకు 25% స్టైఫండ్ పెంపు అమలు చేసే వరకు తమ సమ్మెను విరమించేది లేదని కడప రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే 11వ రోజుకు చేరుకున్న నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి తమ ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వం నుంచి స్టైఫండ్ పెంపుపై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి