రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
హర్షవర్ధన్ రాజు స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ట్రబుల్ మాంగర్లు, ఎన్నికల నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు, మహిళలు–చిన్నారులపై నేరాలు, పెండింగ్ కేసులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజా ఫిర్యాదులను గడువులో పరిష్కరించాలని సూచిస్తూ, ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులను ప్రశంసించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి: కడప ఎస్పీ ఆదేశం కడప: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులకు సూచించారు.
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప, మైదుకూరు, రాజంపేట సబ్ డివిజన్ల నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ట్రబుల్ మాంగర్లపై, ఎన్నికల నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి