రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నారు. 18–19 ఏళ్ల యువ ఓటర్లు, ముసాయిదా జాబితాలో పేరు లేకున్న అర్హులైన పౌరులు ఫారం-6, 7, 8, 8ఎ ద్వారా నమోదు, సవరణలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి సూచించారు.
కడప జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు కడప: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఎస్‌ఆర్)లో భాగంగా జిల్లాలో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చేరుకూరి తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ శిబిరాలను నిర్వహించాలని సంబంధిత ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. నాలుగు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ వివరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి