రాయలసీమ న్యూస్ - అనంతపురం
రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు-1, కనేకల్లు-2 ప్రాంతాల్లో సుమారు 1000 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా 300 మెగావాట్ల కొత్త ప్రాజెక్టుకు ఈ నెల 25న మంత్రి నారా లోకేష్ బాబు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. కనేకల్లులో పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆగష్టు 25న శంకుస్థాపన రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు-1, కనేకల్లు-2 పరిధిలో భారీ స్థాయిలో పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 1000 మెగావాట్ల సామర్థ్యంతో పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలలో భాగంగా మరో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న కొత్త పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఈనెల 25న శంకుస్థాపన జరగనుంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి