రాయలసీమ న్యూస్ - చిత్తూరు
కట్టమంచి నాలుగో డివిజన్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యపై టిడిపి నాయకురాలు డాక్టర్ సి కె లావణ్య బాబు చొరవతో నగరపాలక సంస్థ అధికారులు స్పందించి శుభ్రపరిచే పనులు, మరమ్మతులు ప్రారంభించారు. దీంతో ప్రధాన వీధులు, గల్లీలలో మురుగునీటి నిల్వ తగ్గడం మొదలై ప్రజల్లో ఉపశమనం నెలకొనగా, కాలనీవాసులు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కట్టమంచి నాలుగో డివిజన్‌లో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చిత్తూర్:- నాలుగో డివిజన్ కట్టమంచి ప్రాంత ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం దొరికింది. టిడిపి నాయకురాలు డాక్టర్ సి కె లావణ్య బాబు చొరవతో ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టి పడటంతో, మురుగునీటి కాలువ సమస్యకు నగరపాలక సంస్థ స్థాయిలో చర్యలు ప్రారంభమయ్యాయి.
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సి కె లావణ్య బాబు గత మూడు రోజులుగా నాలుగో డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కట్టమంచి ప్రాంతంలోని వివిధ వీధుల్లో తిరిగి, స్థానికులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు సేకరించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి