రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కేసీ కెనాల్ ఆయకట్టు ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలని రైతు సేవా సమితి డిమాండ్

కడప జిల్లా మైదుకూరులో కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. శ్రీశైలం డ్యాం లో తగిన నీటి మట్టం ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతింటోందని సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కేసీ కెనాల్ ఆయకట్టు ఆరుతడి పంటలకు నీరు విడుదల చేయాలని రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లా కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు లో రైతులు నిరసన తెలిపారు. కడప జిల్లా రైతు సేవా సమితి ఆధ్వర్యంలో మైదుకూరు లోని KC Canal డివిజనల్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

రైతులతో కలిసి నిర్వహించిన ఈ నిరసన అనంతరం డివిజనల్ ఇంజనీర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశామని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు ఆరుతడి పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ, సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →