రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఖాదరాబాద్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, ఉద్యోగుల కుల ధృవీకరణ పత్రాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్ విచారణ నిర్వహించారు. మదరసాలో చదువుతున్నట్లు చూపించిన 39 మంది పేర్లు పాఠశాల రికార్డుల్లోనూ ఉండి, వారు వాస్తవానికి హాజరు కాకపోవడం తేలడంతో వారి పేర్లు తొలగించాలని హెడ్ మాస్టర్‌కు ఆదేశాలు జారీ చేసి, తప్పుడు కుల ధృవీకరణ ఆరోపణలపై కూడా దర్యాప్తు కొ
ఖాదరాబాద్ లో 39 మంది విద్యార్థుల పేర్లు తొలగించాలని ఈఓ నోటీసు ప్రొద్దుటూరు: ఖాదరాబాద్ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉద్యోగుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్ సోమవారం పాఠశాలను సందర్శించి సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆగస్టు 14న ‘పసిడి అక్షరాలు’ వారపత్రిక ఎడిటర్ టప్పా షాకీర్ హుస్సేన్, National Human Rights Anti Corruption and Anti Crime Bureau of India నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆరికొండ ప్రతాప్ కుమార్ కలిసి డిప్యూటీ ఈఓ శివ ప్రసాద్‌కు పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో విద్యార్థుల హాజరు నమోదు, మధ్యాహ్న భోజన పథకం లబ్ధిదారుల సంఖ్య, ఉద్యోగుల కుల ధృవీకరణ పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి