రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు సమీప గోపవరం గ్రామంలో అభివృద్ధి చేస్తున్న MIG NTR స్మార్ట్ టౌన్షిప్ లోని 132 ప్రభుత్వ ప్లాట్లను పారదర్శక ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. చదరపు గజానికి ప్రారంభ ధర రూ.14,000గా నిర్ణయించి, దరఖాస్తు, ఫీజులు, EMD చెల్లింపు తదితర ప్రక్రియలను అర్బన్ ల్యాండ్ e- ఆక్షన్ పోర్టల్ ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు.
ప్రొద్దుటూరు సమీపంలో KUDA ఆధ్వర్యంలో MIG NTR స్మార్ట్ టౌన్షిప్ ప్రభుత్వ ప్లాట్ల ఈ-వేలం కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి చేస్తున్న MIG NTR స్మార్ట్ టౌన్షిప్ లో ప్రభుత్వ ప్లాట్లను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్.
వరదరాజుల రెడ్డి అభ్యర్థించారు. ఈ ప్రభుత్వ లేఅవుట్‌లో విశాలమైన రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్కులు, పచ్చదనం వంటి అన్ని మౌలిక వసతులను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి