ప్రొద్దుటూరు సమీపంలో KUDA ఆధ్వర్యంలో MIG NTR స్మార్ట్ టౌన్షిప్ ప్రభుత్వ ప్లాట్ల ఈ-వేలం

కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి చేస్తున్న MIG NTR స్మార్ట్ టౌన్షిప్ లో ప్రభుత్వ ప్లాట్లను ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి అభ్యర్థించారు.

ఈ ప్రభుత్వ లేఅవుట్‌లో విశాలమైన రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్కులు, పచ్చదనం వంటి అన్ని మౌలిక వసతులను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రైవేట్ వెంచర్లలో తరచుగా ఎదురయ్యే రహదారి సమస్యలు, అనుమతుల ఆలస్యం, మౌలిక సదుపాయాల లోపాలు వంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వ లేఅవుట్‌లో ఉండవని, ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్రంగా అభివృద్ధి చేయబడుతున్నందున ఇది విశ్వసనీయమైన ప్రాజెక్టుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్లాట్ కొనుగోలు చేయడం ద్వారా పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉంటాయని, చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు లేకుండా కొనుగోలు–అమ్మకాలు జరిపే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి వివరించారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ లేఅవుట్‌లో మొత్తం 132 ప్లాట్లను పారదర్శకమైన ఆన్‌లైన్ ఈ-వేలం విధానంలో విక్రయించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ కొనుగోలు అర్బన్ ల్యాండ్ e- ఆక్షన్ పోర్టల్ ద్వారా మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు.

దరఖాస్తు మరియు ఈ-వేలం కోసం అధికారిక వెబ్‌సైట్ https://bhookonugolu.ap.gov.in ను ఉపయోగించాలి. దరఖాస్తు వివరాల ప్రకారం ప్లాట్ ఫారం ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.2,000, ఎఆర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) రూ.1,00,000గా నిర్ణయించారు. ప్రారంభ విక్రయ ధర చదరపు గజానికి రూ.14,000గా నిర్ధారించారు.

ఆన్‌లైన్ నమోదు 2026 జూలై 28 ఉదయం 10.00 గంటల నుండి 2026 ఆగస్టు 18 రాత్రి 10.00 గంటల వరకు కొనసాగుతుంది. ఈ-వేలం 2026 ఆగస్టు 20న ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు https://bhookonugolu.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, లేఅవుట్ మ్యాప్, ప్లాట్ వివరాలు, EMD చెల్లింపు విధానం, వేలం నిబంధనలు తదితర పూర్తి సమాచారాన్ని పరిశీలించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి ప్రజలను కోరుతున్నారు.

ప్రభుత్వ ప్లాట్ కొనుగోలు చేయడం అంటే మీ కుటుంబ భవిష్యత్తుకు సురక్షిత పెట్టుబడి. ఈ సువర్ణావకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి.

ఎన్. వరదరాజుల రెడ్డి, శాసనసభ్యులు, ప్రొద్దుటూరు నియోజకవర్గం, ఈ ప్రభుత్వ లేఅవుట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సురక్షిత గృహావకాశాలు లభిస్తాయని, పారదర్శక ఈ-వేలం విధానం ద్వారా ప్లాట్ల కేటాయింపు పూర్తిగా న్యాయంగా, సమాన అవకాశాలతో జరుగుతుందని పేర్కొన్నారు.