రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలులో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుపుతున్న 20 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించారు. తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి రహదారి భద్రత, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించి, భవిష్యత్తులో ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.
కర్నూలులో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ – 20 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు కర్నూలు: పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుపుతున్న 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.
జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కర్నూలు పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు నుండి మౌర్య Inn మధ్యలో ఉన్న చైతన్య కాలేజీ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి