రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

మదనపల్లెలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

మదనపల్లె పట్టణంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన రెండు హోటళ్లపై జరిమానాలు విధించారు. వాడిన వంటనూనెను తిరిగి వాడటం, పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల సరైన నిల్వ లేకపోవడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు కూడా హోటళ్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ విభాగం సూచించింది. మదనపల్లె లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు మదనపల్లె పట్టణంలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు హోటళ్లపై జరిమానాలు విధించారు.

జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో శనివారం ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాల్లో ఉన్న పలు హోటళ్లను అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →