రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో అనారోగ్యంతో మరణించిన, బంధువులు లేని గుర్తు తెలియని వ్యక్తికి ప్రొద్దుటూరు వర్నమెంట్ హాస్పిటల్ నుంచి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు లేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేయడం, నిరుపేదలు, వృద్ధులకు సేవలు అందించడం ఫౌండేషన్ లక్ష్యమని సభ్యులు పేర్కొంటూ, ఇలాంటి సేవ
గుర్తుతెలియని వ్యక్తికి ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ అంత్యక్రియలు ప్రొద్దుటూరు : ఎవరూ అడగని, బంధువులు లేని గుర్తు తెలియని వ్యక్తికి చివరి వీడ్కోలు పలికేందుకు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న ఈ వ్యక్తి, ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంలో అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం.
మరణించిన వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు లభించకపోవడంతో పాటు, అంతిమ సంస్కారాలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానిక పోలీసు సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫౌండేషన్ ప్రతినిధులు స్పందించి అంత్యక్రియల ఏర్పాట్లు చేపట్టారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి