రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం CHC ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక యాంత్రీకరణ చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో సకాలంలో పనులు పూర్తి చేయడంలో తోడ్పడుతుందని, పెట్టుబడి భారం తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని ఆయన తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంబేపల్లిలో CHC కేంద్రం ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో రైతులకు ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రం (CHC – Custom Hiring Centre) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండ
సంబేపల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో యంత్రాల వినియోగం ఎంతో కీలకమని పేర్కొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి