రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
ముద్దనూరు–కడప రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, కడప నగరంలోని ఇర్కాన్ సర్కిల్–జేఎంజే సర్కిల్, ఇర్కాన్–ఐటీఐ సర్కిల్ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల భద్రత, పార్కింగ్ సౌకర్యాల మెరుగుదల కోసం వైయస్ అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు. పై మూడు అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలిపాయి.
ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి కలిశారు. వైఎస్సార్ జిల్లాలో రహదారి అభివృద్ధి, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం పలు ప్రతిపాదనలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముద్దనూరు నుంచి కడప వరకూ ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని ఎంపీ వివరించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, రహదారి విస్తరణ ద్వారా ప్రయాణ సౌలభ్యం, రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆయన కేంద్ర మంత్రికి తెలియజేశారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి