రాయలసీమ న్యూస్ - నంద్యాల
ఆత్మకూరు సమీప నల్లమలలోని కొట్టాల చెరువు చెంచుగూడెంలో 9 ఏళ్ల పావని అనే బాలికను షాపు యజమాని మల్లి నాయక్, రాజు నాయక్ కలిసి ఇంట్లో స్తంభానికి కట్టి గంటల పాటు చిత్రహింసలకు గురి చేసిన ఘటన స్థానికులను కలవరపెడుతోంది. బాలికను అగరుబత్తీలతో కాల్చి, బలవంతంగా సారా తాగించేందుకు ప్రయత్నించడంతో పాటు, దగ్ధం చేసి వరదరాజ స్వామి ప్రాజెక్టులో పారవేయాలనే యత్నం చేసినట్లు చిన్నారి వెల్లడించగా, గిరిజనులు ఇద్దరిపై కఠిన చర్
ఆత్మకూరు సమీప నల్లమలలో 9 ఏళ్ల బాలికపై అమానుష వేధింపులు ఆత్మకూరు సమీప నల్లమల అటవీ ప్రాంతంలోని కొట్టాల చెరువు చెంచుగూడెంలో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన క్రూర ఘటన స్థానికులను కలవరపెడుతోంది. నాలుగో తరగతి చదువుతున్న పావని అనే బాలికను అదే గూడెంలో దుకాణం నడుపుతున్న మల్లి నాయక్ అనే వ్యక్తి ఇంట్లో స్తంభానికి తాళ్లతో కట్టి గంటల పాటు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
చెంచుగూడెం కొట్టాల చెరువులో నివసిస్తున్న పావని, ఇంటి సమీపంలో ఉన్న షాపు వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె బంధువులు గాలింపు ప్రారంభించారు. చివరకు షాపు యజమాని మల్లి నాయక్ ఇంట్లోనే చిన్నారిని తాళ్లతో స్తంభానికి కట్టి బంధించి, మూడు గంటల పాటు చిత్రహింసలకు గురి చేసినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి