రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఉటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతను మాదకద్రవ్యాలు, సెల్‌ఫోన్, టీవీ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, విలువలతో కూడిన సమాజ నిర్మాణం, ఆరోగ్యకర జీవన విధానం, రాజయోగ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిర్వాహకులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

ప్రొద్దుటూరులో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభం కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఉటుకూరు వీరయ్య ఉన్నత పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణ లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సి.వి.

అమర్‌నాథ్ రెడ్డి, ఓం శాంతి భవన్ నిర్వాహకులు బీకే శాంత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీకే శాంత మాట్లాడుతూ, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, విలువలతో కూడిన సమాజ నిర్మాణమే నశాముక్త భారత్ అభియాన్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →