రాయలసీమ న్యూస్ - చిత్తూరు

నీవా బ్రాంచ్ కెనాల్‌కు రూ.105 కోట్లు మంజూరు – చిత్తూరులో టీడీపీ నేతల ఆనందం

నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్ల నిధులు మంజూరు చేయడంపై చిత్తూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల సాగునీటి సమస్యలు తగ్గి, రైతులకు నిరంతర నీరు అందడంతో పాటు భూసారం పెరుగుతుందని, నియోజకవర్గ నీటివనరులు బలోపేతం అవుతాయని వారు అభిప్రాయపడ్డారు.

నీవా బ్రాంచ్ కెనాల్‌కు రూ.105 కోట్లు మంజూరు – చిత్తూరులో టీడీపీ నేతల ఆనందం చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గంలోని సాగుభూములకు నీటిని అందించే లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్ల నిధులు మంజూరు చేయడంపై టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం నియోజకవర్గ అభివృద్ధికి కీలకంగా మారనుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా గురువారం చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలోని స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, స్థానిక నాయకులు హాజరయ్యారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →