రాయలసీమ న్యూస్ - అన్నమయ్య

రాయచోటి ఆర్టీసీ డిపోలో మేనేజర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా NMUA గేట్‌ ధర్నా

రాయచోటి ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా NMUA ఆధ్వర్యంలో గేట్‌ ధర్నా రెండో రోజూ కొనసాగింది. డ్రైవర్లు, కండక్టర్లకు ఫిక్స్‌డ్ చార్ట్‌ లేకుండా, ఓ.డీ.

అవకాశాలు ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకు మాత్రమే కల్పించడం, డ్యూటీ కేటాయింపుల్లో పారదర్శకత లేకపోవడం, కాలం చెల్లిన టిమ్ మెషీన్ల డ్యామేజ్ పేరుతో రికవరీ వంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేస్తూ, మార్పులు లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయచోటి ఆర్టీసీ డిపోలో మేనేజర్‌ నిర్ణయాలకు వ్యతిరేకంగా NMUA గేట్‌ ధర్నా అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ డిపోలో మేనేజర్‌ ఏకపక్ష నిర్ణయాలకు

డిపో గ్యారేజ్‌ వద్ద ఉదయం 11 గంటలకు టీ విరామ సమయంలో నిర్వహించిన ఈ ధర్నాలో ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. దాదాపు నాలుగు నెలలుగా డ్రైవర్లు, కండక్టర్లకు ఫిక్స్‌డ్ చార్ట్‌ వేయకుండా, కేవలం NMUA సభ్యులను మాత్రమే స్పేర్ డ్యూటీలకు పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →