రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
జిల్లాలోని పాత కలెక్టరేట్ భవనం, మహిళా ప్రాంగణం నిర్లక్ష్యంతో పాడైపోతూ, మందుబాబుల అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాల కేంద్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ వాహనాలు, పరికరాలు తుప్పు పట్టి నష్టపోతుండగా, One Town Police Station సమీపంలోనే ఇలా జరుగుతుండటం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తూ, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కడప పాత కలెక్టరేట్ భవనం మందుబాబుల అడ్డాగా మార్పు కడప:- కడప లోని పాత కలెక్టర్ కార్యాలయం పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోతుండటం స్థానికుల్లో ఆందోళనకు దారితీస్తోంది. కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి అధికారుల నిర్లక్ష్యంతో పాడుబడిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కలెక్టరేట్ కొత్త భవనానికి కార్యాలయాలు మారిన తర్వాత పాత కలెక్టర్ కార్యాలయం నిర్లక్ష్యానికి గురైంది. ఆ ప్రాంగణం చుట్టూ బీర్, మద్యం బాటిల్స్ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి