రాయలసీమ న్యూస్ - చిత్తూరు
పలమనేరు పట్టణంలో ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించారు. లక్ష్మీనగర్ కాలనీ సమీపంలో ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక దింపుతున్న గంగవరం రాజును అరెస్ట్ చేసి, ఐదు టన్నుల ఇసుక, ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని BNS సెక్షన్ 303(2)తో పాటు మైన్స్ అండ్ మినరల్స్ Act కింద కేసు నమోదు చేశారు.
పట్టణ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకం, రవాణా, నిల్వలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తూ, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు పట్టణంలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు పలమనేరు పట్టణంలో ఇసుక అక్రమ రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 10, 2026 సోమవారం ఉదయం పలమనేరు అర్బన్ పోలీస్ సిబ్బంది పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ పర్యవేక్షణ చేపట్టారు. ఈ పర్యవేక్షణ సమయంలో లక్ష్మీనగర్ కాలనీ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఒక ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా దించుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి