రాయలసీమ న్యూస్ - కర్నూలు

ఉద్యానవనాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు : కమిషనర్ చల్లా ఓబులేసు

నగరంలోని ఉద్యానవనాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. పీపీపీ, సాధారణ, సీఎస్‌ఆర్ నిధులతో పార్కుల్లో పచ్చదనం, నడక మార్గాలు, బెంచీలు, పిల్లల ఆట స్థలాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు.

డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఉద్యానవనాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు : కమిషనర్ చల్లా ఓబులేసు నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన పచ్చదనం అందించేందుకు నగరంలోని ఉద్యానవనాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

మంగళవారం ఆయన పరిమళ నగర్ ఉద్యానవనాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ నగరంలో ఉన్న ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →