రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకాలి: పఠాన్ మహమ్మద్ అలీఖాన్

కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రోత్సహిస్తున్న కుల, మత రాజకీయాలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌లో మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన రామ్‌లీలా మైదానాన్ని శుద్ధి చేయడం దళితులపై వివక్షకు నిదర్శనమని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకిక విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకాలి: పఠాన్ మహమ్మద్ అలీఖాన్ ప్రొద్దుటూరు: దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొనసాగిస్తున్న కుల, మత రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన రామ్‌లీలా మైదాన ప్రాంతాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు శుద్ధి చేయడం అత్యంత హేయమైన చర్యగా అలీఖాన్ అభివర్ణించారు. ఖర్గే దళితుడు కావడమే కారణంగా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్లు భావన కలిగించేలా ఈ చర్య జరిగిందని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →