రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

పెన్నా నదిలో ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు

జమ్మలమడుగు పరిసరాల్లో పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ, ఇసుక మాఫియా మినహాయింపులను ఆసరాగా తీసుకుని భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తోంది. నదీ గర్భంలో ఏర్పడుతున్న గుంతలు ప్రమాదకరంగా మారాయని, గతంలో యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గుర్తుచేసుకుంటూ, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుని పర్యవేక్షణను బలోపేతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పెన్నా నదిలో ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు జమ్మలమడుగు: జిల్లాలోని ప్రధాన నదుల్లో ఇసుక తవ్వకాలపై అమల్లో ఉన్న నిషేధం కాగితాలకే పరిమితమవుతున్నదనే పరిస్థితి నెలకొంది. పర్యావరణ పరిరక్షణతో పాటు వర్షాకాలం దృష్ట్యా అక్టోబర్ 15 వరకు ఇసుక రీచుల్లో ఎలాంటి తవ్వకాలు జరపరాదని జిల్లా కలెక్టర్, గనుల శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ దృశ్యాలు కనిపిస్తున్నాయి.

జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లోని పెన్నా నదిని ఇసుక అసురులు చేరబట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →