రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
పెనుకొండ కోటలోని బసవన్న బావి లోపలి రాతిపై కన్నడ లిపిలో చెక్కిన సంస్కృత ఏకవాక్య శాసనం ‘శ్రీత్రయంబక శరణు’ను చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించి జలనిధి శాసనంగా విశ్లేషించారు. విజయనగర కాలపు జలసంస్కృతి, శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ శాసనం, నీటి వనరులను పవిత్ర స్థలాలుగా భావించిన శైవ సంప్రదాయాలకు బలమైన ఆధారంగా నిలుస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
పెనుకొండ కోట బసవన్న బావిలో అరుదైన శాసనం వెలుగు పెనుకొండ: విజయనగర సామ్రాజ్య ద్వితీయ రాజధానిగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన పెనుకొండ కోట పరిధిలో అరుదైన శాసనం వెలుగులోకి వచ్చింది. కోటలోని కాశీవిశ్వేశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న బసవన్న బావి (మెట్లబావి–కోనేరు) లోపలి రాతిపై చెక్కబడిన సంస్కృత ఏకవాక్య శాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించి విశ్లేషించారు.
బావి లోపలి రాతి నిర్మాణంపై ‘శ్రీత్రయంబక శరణు’ అనే సంస్కృత ఏకవాక్య శాసనం రెండు వరుసలుగా కన్నడ లిపిలో చెక్కబడి ఉంది. ఈ శాసనాన్ని జలనిధి శాసనంగా మైనాస్వామి పరిశీలించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి