రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే మా లక్ష్యం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు “స్వచ్ఛ సంకల్ప దీక్ష – ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు” కార్యక్రమాన్ని Anibicent Municipal High School మైదానంలో 10 వేల మందితో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు, ప్రత్యామ్నాయ వినియోగంపై ప్రచారం, ప్రజల భాగస్వామ్యంతో ఇంటి స్థాయిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరే మా లక్ష్యం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం లేని నగరంగా మార్చడమే తమ లక్ష్యమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు.

ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయంలో జరిగిన “స్వచ్ఛ సంకల్ప దీక్ష – ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు” అడ్వైజరీ కమిటీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం నాటికి ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మార్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సూచించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →