రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ప్రొద్దుటూరులో నిలిచిపోయిన ఆవాస్ ఇళ్ల నిర్మాణాలు

ప్రొద్దుటూరులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన సుమారు 23 వేల ఇళ్లలో అనేక గృహాలు నిర్మాణ దశల్లోనే నిలిచిపోయాయని బీజేపీ నగరం-1 అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నందున, అసంపూర్తి గృహాలను పరిశీలించి త్వరగా పూర్తి చేయడంతో పాటు రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలన

ప్రొద్దుటూరులో నిలిచిపోయిన ఆవాస్ ఇళ్ల నిర్మాణాలు ప్రొద్దుటూరు: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చాలని బీజేపీ ప్రొద్దుటూరు నగరం-1 అధ్యక్షుడు వంకదార నరేంద్రరావు కోరారు. సోమవారం ఈ విషయమై ఆయన బీజేపీ నాయకులతో కలిసి మున్సిపాలిటీకి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

తరువాత మీడియాతో మాట్లాడిన నరేంద్రరావు, ప్రొద్దుటూరు పట్టణంలో సుమారు 23 వేల ఇళ్లు మంజూరైనప్పటికీ అనేక ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లోనే నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు తమ వంతుగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణాలు పూర్తి చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →